మహిళా కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్‌..

3 Oct, 2018 12:29 IST
ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ హామీ 
విజయనగరంః అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా కానిస్టేబుళ్లకు వారంతపు సెలవు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో పలువురి మహిళా కానిస్టేబుళ్లు  తమ సమస్యలను వైయస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను పిలిచి వైయస్‌ జగన్‌ మాట్లాడటంతో వారు హర్షం వ్యక్తం చేశారు.. ఏ నాయుకుడు కూడా ఇలా పోలీసుల సమస్యలు గురించి పట్టించుకోలేదన్నారు. తమను పిలిచి ఎంతో ఆప్యాయంగా సమస్యలు తెలుసుకుని హామీ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. కుటుంబాలతో కనీసం వారానికి ఒకరోజు కూడా గడిపే అవకాశం లేకపోవడం బాధాకరమని,మానవత్వంతో ఆలోచించాలని వైయస్‌ జగన్‌ అన్నారు.