పేపర్‌ లీకేజ్‌ వ్యవహారాన్ని బయటపెట్టిన వైయస్‌ జగన్‌

28 Mar, 2017 14:21 IST

ఏపీ అసెంబ్లీ:  ఏపీ శాసనసభను ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. నారాయణ హైస్కూల్‌లో టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని మంగళవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత∙వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటపెట్టారు. సభలో ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నివేదికన చూపిస్తూ  మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను భర్తరఫ్‌ చేయాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. వైయస్‌ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పలుమార్లు వెల్‌లోకి దూసుకెళ్లి వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను మూడోసారి స్పీకర్‌ వాయిదా వేశారు.