వైయస్ జగన్ విదేశీ పర్యటన
26 May, 2017 12:31 IST
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాత్రి 11 గంటలకు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుటుంబ సభ్యులతో కలసి జగన్ పయనమయ్యారు. రెండు వారాల అనంతరం వైయస్ జగన్ స్వదేశానికి తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.