పిల్లలందరిని చదివించే బాధ్యత నాదే
14 Nov, 2018 09:41 IST
విజయనగరం: రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లలందరిని చదివించే బాధ్యత తీసుకుంటానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పిల్లల ఎదుగుదల కోసం, వారి అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఉత్తమమైన ప్రదేశంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంకల్పయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైయస్ జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పిల్లలందరిని చదివించే బాధ్యత తీసుకుంటామని నవరత్నాల్లో పేర్కొన్నారు. తమ బిడ్డలను ఏ స్కూల్‌కు పంపించినా ఆ తల్లి ఖాతాలో ప్రతి ఏడాది రూ.15 వేలు జమా చేస్తానని జననేత హామీ ఇచ్చారు.