అరకు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23 Sep, 2018 19:11 IST
విశాఖ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రతిపక్ష నేత ప్రగాఢ సానుభూతి తెలిపారు.