సర్వేపల్లికి జననేత ఘన నివాళి
5 Sep, 2018 11:49 IST
- ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న వైయస్ జగన్
- అధ్యాపకులకు సన్మానం
విశాఖపట్నం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైయస్ జగన్ పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవలను జననేత గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైయస్ జగన్ సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, గుడివాడ అమరనాథ్తో పాటు పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
