జగన్నాయకపాలెం నుంచి 207వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

7 Jul, 2018 09:07 IST
తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 207 రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జననేత చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైయ‌స్‌ జగన్ ప్రజాసంకల్పాయత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి చిన్నతాళ్లపొలం, పెద తాళ్ల పొలం, వేళ్ల క్రాస్‌ రోడ్ మీదుగా రామచంద్రాపురం చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.