గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ..!
1 Oct, 2015 15:58 IST
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జగన్ చర్చించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 7 నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.