వైయస్ జగన్ లండన్ పర్యటన
28 Oct, 2017 12:58 IST
హైదరాబాద్
: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం లండన్‡ బయల్దేరి వెళ్లారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరు నెలల పాటు కొనసాగనుంది. వైయస్ జగన్ పెద్ద కుమారై వైయస్ హర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేస్తున్న విషయం విధితమే. కాగా పాదయాత్ర చేపట్టాక కుమార్తెను చూసేందుకు వీలుండదు కాబట్టి శనివారం ఉదయం బయల్దేరి లండన్ వెళ్లారు. మూడు రోజుల పాటు జననేత లండన్ పర్యటన కొనసాగనుంది.