నాటా మహాసభలకు వైయస్ జగన్‌కు ఆహ్వానం
14 Dec, 2017 12:01 IST
అనంతపురం: అమెరికాలో 2018 జూలైలో నిర్వహించనున్న నాటా మహాసభలకు హాజరుకావాలని నాటా ప్రతినిధులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను నాటా అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోసల రాఘవరెడ్డి, కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు కొరసపాటి శ్రీధర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం చైర్మన్ ఆళ్ల రామిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ అన్నపురెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.