విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి..!

22 Sep, 2015 18:25 IST
విశాఖపట్నంః విశాఖ విద్యార్థి యువభేరి సక్సెస్ అయ్యింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై గర్జించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులు,యువతకు తెలియజెప్పారు. ఈసందర్భంగా స్పెషల్ స్టేటస్ కు సంబంధించి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు  ఇచ్చారు. వారి సందేహాలు నివృత్తి చేశారు.

వారి మాటల్లోనే చూద్దాం..!
రాజేశ్..
నేను మెకానికల్ డిప్లమా చేశాను. టెన్త్ క్లాస్ లో 98  పర్సంట్ ఉంది. కానీ నాకు ఈరోజుకు జాబ్ లేదు. మా తమ్ముడు ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం లేదు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి మాకు ఉచితంగా చదివు చెప్పించారు. చంద్రబాబును గుడ్డిగా నమ్మి ఓటేశాను. నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. ఒక్కరూపాయి ఇవ్వలేదు. మానాన్న చనిపోయారు. మాఅమ్మ టిఫిన్ బండి నడిపిస్తుంది. రూ.2 వేలు కాదు మాకు రూ.200 ఇచ్చినా చాలు. మాకోసం పోరాడండి సార్. 
వైఎస్ జగన్..
చంద్రబాబు నీవు ఇస్తామన్న నిరుద్యోగభృతి కోసం రూ.కోటి 75 లక్షల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు ఉద్యోగం ఇవ్వడు...నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఓట్లు వేయించుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక జాబులను గాలికి వదిలేశాడు. ప్రత్యేకహోదా వస్తే నో వేకెన్సీ బోర్డు కనిపించదు. మనమే కంపెనీలు ఎంచుకోవచ్చు.

ప్రశాంత్..
నేను ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. రాజకీయాల్లోకి రావాలని ఉంది. కానీ అచ్చెన్నాయుడు, దేవినేని మాటలు చూస్తే కౌరవుల సభే గుర్తుకువస్తుంది. రాజకీయాల్లోకి రావాలా..వద్దా..?
వైఎస్ జగన్..
మనం నేటి జనరేషన్..కుళ్లు, కతంత్రాలను కడిగేద్దాం. నీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. న్యాయం జరుగుతుంది.

స్వామిరెడ్డి లక్ష్మినాయుడు..
సార్ నాది  డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. చదువుకునేందుకు డబ్బులు లేక వైన్ షాపులో గుమస్తాగా  చేస్తున్నా...కానీ అవి కూడా మేమే నడిపిస్తామంటూ ప్రభుత్వం తీసుకుంటోంది.  సిగ్గుమాలిన మంత్రులున్నారు. రిజైన్ చేయాలని సూటిగా అడుగుతున్నాం. 
వైఎస్ జగన్...
మనం ఒత్తిడి చేస్తే చంద్రబాబు, కేంద్ర పెద్దలు దిగివస్తారు. త్వరలోనే అన్నీ జరుగుతాయి.
ఆమ్నాఖాన్..
సార్ ప్రత్యేకహోదా వస్తే మహిళలకు ఎలాంటి  ప్రయోజనం ఉంటుంది..?మైనారిటీల కోసం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేశారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చాయి. మరింతకాలం ఇదే కొనసాగితే మేం ముందుకు రాగలం.
వైఎస్ జగన్...
ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రమంతా బాగుపడుతుంది. ఏ ఇండస్ట్రీ కావాలన్నది మనం డిసైడ్ చేయోచ్చు.

వరలక్ష్మి..
ప్రత్యేకహోదా వస్తే అన్నీ వస్తాయంటున్నారు. నీను ఓసీ. మేం చాలా పేదవాళ్లం. మానాన్న లేరు. ఓసీలలో కూడా పేదవాళ్లున్నారు. వాళ్ల గురించి కూడా ఆలోచించాలి సార్. 
వైఎస్ జగన్...
హోదా కాస్ట్ వైజ్ కాదు తల్లి. కానీ ఒకటి మాత్రం చెప్పగలం. ప్రత్యేకహోదా ఉంటే  పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ రాష్ట్రానికి వస్తారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఆప్షన్ మనకే ఉంటుంది. చదువుల్లో పర్సెంటేజీ బాగుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. 

కరుణాంజలి..
మనం ఎంత పోరాటం చేసినా రాష్ట్రం విడిపోయింది. మరి ఇప్పుడు ప్రత్యేకహోదా వస్తుందా...అందుకు మనమేం ఏం చేయాలి..?
వైఎస్ జగన్..
పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ నాయకులంతా ఆయన పేరును నాశనం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు. వాళ్లను మనమేదో బిక్ష అడగడం లేదు. ఇది మనహక్కు. హోదా ఇస్తామని చెప్పాకే రాష్ట్రాన్ని విడగొట్టారు తల్లి. చంద్రబాబు కేంద్రంలో మంత్రులు ఉపసంహరించుకుంటే ఒత్తిడి వస్తుంది. కానీ చంద్రబాబు ఆపని చేయడం లేదు. అందుకే మనం ఆయనపై ఒత్తిడి తీసుకురావాలి. కలిసికట్టుగా అందరం పోరాడుదాం. 

సుబ్బారెడ్డి...
రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు. మరి మనరాష్ట్రంలో చదివిన సివిల్ ఇంజినీర్లు పనికిరారా. మేం చదవడమే తప్పా. గాంధీ చెడు వినొద్దు మాట్లాడవద్దు అంటే. చంద్రబాబు ప్రత్యేకహోదా అనొద్దు వినొద్దు అంటున్నారు. అసలు  ఆయన ఉద్దేశ్యమేంటి. మీం అంతా నీవెనకాలే ఉంటాం సార్.
వైఎస్ జగన్..
చంద్రబాబు కలిసినప్పుడు ఈవిషయంపై గట్టిగా నిలదీయండి. 

తేజ..
సార్ మేం పేదలం. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయ వల్ల మా తమ్ముడు ఇంజినీరింగ్ చదువుకొని విప్రోలో రూ.40 వేల జాబ్ చేస్తున్నాడు. అలాగే అందరూ చేయాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలి. చంద్రబాబు మీ కొడుకు లాగా అందరూ బాగుపడొద్దా అని మేం అడుగుతున్నాం. మాఅమ్మ రెండు సార్లు కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి చలవ వల్ల ఆరోగ్య శ్రీ పుణ్యమాని ఒక్కరూపాయి కట్టలేదు. మీ ఆధ్వర్యంలో పోరాడుతాం.
వైఎస్ జగన్...
చంద్రబాబు మోసాలు ఎంత గొప్పగా చేస్తారంటే. సాఫ్ట్ వేర్ నేనే తెచ్చా, సెల్ ఫోన్లు నేనే తెచ్చా. హైదరాబాద్ నేనే కట్టా అంటాడు. అసెంబ్లీలో ఐతే మరీ దారుణం .మాకు కూర్చోబెట్టి మరీ సోది వేస్తాడు. ఆయన చెప్పేది ఒక్కోసారి ఏమీ అర్థం కాదు. మా చెవిలో పూలున్నాయనుకుంటాడు. ఆయన చెప్పడం మేం తల ఊపడం అంతే. చంద్రబాబు సీఎం కాకముందు,  దిగిపోయేటైంకు సాఫ్ట్ వేర్ లో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2009-10లో సాఫ్ట్ వేర్ లో మనం మూడో స్థానానికి వెళ్లాం.చంద్రబాబు దిగిపోయేటప్పుడు 909 కంపెనీలుంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో 1584 కంపెనీలు అయ్యాయి. ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ ఉందనుకొని గ్లోబల్స్ ప్రచారం చేస్తాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్ కు స్టూడెంట్స్ లైవ్ స్టార్ బిరుదు ఇచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలని కోరారు.