రేపు వైయస్ జగన్ పుష్కర స్నానం
12 Aug, 2016 09:08 IST
హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాల సందర్బంగా రేపు ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుణ్య స్నానాలు చేయనున్నారు. జన నేత వైయస్ జగన్ విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. వాస్తవానికి శుక్రవారం పుష్కర స్నానం చేయాలని జగన్ భావించారని, అయితే తొలిరోజు కావడంతో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శనివారానికి మార్చుకున్నార ని వివరించారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరగాలని, వీటి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతా శుభం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.