నేను తడిమి చూసిన బాధ
25 Jul, 2016 10:23 IST
విశాఖపట్నం) విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూసి ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ చలించిపోయారు. ఆవేదన వెలిబుచ్చుతూ ట్వీట్ చేశారు.
** నేను ఈ బాధను అనుభూతి చెందగలను. గతంలో నేను అనుభవించిన ఈ వేదన ఇక ఎవరికీ రాకూడదని వాంఛిస్తున్నాను. ఇటువంటి కష్టం సమయంలో ఆ కుటుంబసభ్యులకు భగవంతుడే తోడుగా ఉంటాడు** అని ట్వీట్ చేశారు.
విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని వైయస్ జగన్ ఈ రోజు స్వయంగా పరామర్శ చేశారు. ప్రతీ కుటుంబం దగ్గరకు వెళ్లి పలకరించి ధైర్యం చెప్పారు.
I can feel their pain, wish no one has to grieve a loss like I did. God be with the families in this difficult time.