వైయస్ జగన్ దిగ్భ్రాంతి
25 Apr, 2018 13:19 IST
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకానందరెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న వైయస్ జగన్ ఆనం మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.