చంద్రబాబుకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
7 Jun, 2014 17:37 IST
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు శుక్రవారంనాడు శ్రీ జగన్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. ఈ నెల 8న సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.