లావు రత్తయ్య కుమార్తె వివాహానికి వైయస్ జగన్
3 Dec, 2016 11:50 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరులో జరిగే విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఉదయాన్నే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్ గుంటూరుకు రోడ్డు మార్గాన వెళ్లారు. లావు రత్తయ్య కుమార్తె ఇందిర ప్రియదర్శిని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి అనంతరం వైయస్ జగన్ అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.