కాకినాడ కు వైయస్ జగన్
10 May, 2016 09:29 IST
కాకినాడ) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ ఉదయం కాకినాడకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం, అక్కడ నుంచి రోడ్ మార్గంలో కాకినాడ లోని కలెక్టరేట్ దగ్గరకు చేరుకొంటారు. అక్కడ ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక హోదా ధర్నా లో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా దిశగా పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు.
To read this article in English: http://bit.ly/1Np0dsF