దళితులకు అండగా గరగపర్రుకు వైయస్ జగన్
29 Jun, 2017 11:12 IST
పశ్చిమగోదావరి : వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రేపు గరగపర్రులో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా గరగపర్రు చేరుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పేర్కొన్నారు. సాంఘీక బహిష్కరణకు గురైన దళితులను వైయస్ జగన్ పరామర్శిస్తారని తెలిపారు. అక్కడ దళితులతో మాట్లాడిన తర్వాత నేరుగా తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తారని వివరించారు