తప్పుడు హామీలతో బాబు నట్టేట ముంచాడు
ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పుడు హామీలతో అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కదిరి నియోజకవర్గంలోని పార్థసారధిలో వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర 42వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జననేత అక్కడి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత బ్యాంక్‌లకు వడ్డీ డబ్బులు కట్టడం మానేశాడని, అందుకే బ్యాంక్‌లు సున్నావడ్డీలు, పావలా వడ్డీలు ఇవ్వడం లేదన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంక్‌లకు వడ్డీ లెక్కలు కడతామని, అప్పుడు బ్యాంక్‌లు సున్నావడ్డీలు ఇస్తాయన్నారు. అంతే కాకుండా ఎన్నికలు అయిపోయిన తరువాత రెండో రోజు డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంక్‌లకు వెళ్లి అప్పు ఎంత ఉందో రశీదు తెచ్చుకోవాలని, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పు నాలుగు దఫాలుగా సపరేట్‌గా మీ చేతికే ఇస్తామన్నారు. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు కంటతడి పెట్టుకోకుండా పాలన చేస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.