వీఆర్ఏ ల దీక్షకు జననేత మద్దతు
8 Dec, 2015 17:51 IST
విజయవాడ: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయవాడ లెనిన్ సెంటర్‌లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కనీసవేతనాలు వర్తింప చేయాలన్న వీఆర్ఏల డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం నెల రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణం అని వైఎస్ జగన్ మండిపడ్డారు. వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.