వైఎస్ జగన్ దీక్షకు తెలంగాణ ప్రజల మద్దతు..!

9 Oct, 2015 10:48 IST
కరీంనగర్ః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష  విజయవంతం కావాలని కోరుతూ  తెలంగాణ లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు , ప్రజలంతా కోరుకుంటున్నారు. 

దీక్ష శుభప్రదం కావాలని కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో  వైఎస్ఆర్సీపీ  జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీసంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుంటూరుకు బయలుదేరారు.