తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

28 Sep, 2017 16:25 IST

హైదరాబాద్ః ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ  వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంటకులు, దుష్టశక్తుల మీద దైవ శక్తుల స్ఫూర్తి దాయక విజయానికి దసరా పండగ ప్రతీక అని వైయస్ జగన్ అన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, సంతోషాలతో తూలతూగేలా  అందరికీ జగన్మాత దీవెనలు లభించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.