మంత్రి నారాయణను పరామర్శించిన వైయస్ జగన్
11 May, 2017 12:34 IST
హైదరాబాద్ః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతికి సంతాపం తెలియజేశారు. మంత్రి నారాయణను వైయస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. నిశిత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిశిత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా, నిన్న రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, అతని స్నేహితుడు రవివర్మ మృతి చెందిన విషయం తెలిసిందే.