వైయస్ జగన్ పరామర్శ

8 May, 2017 14:45 IST
అనంతపురం : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి  ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా నారాయణరెడ్డి అనంతపురం మాజీ ఎమ్మెల్యే (వైఎస్‌ఆర్‌సీపీ) గురునాథ్‌ రెడ్డి సోదరుడు. పెనకలపాడులో ఇవాళ నారాయణరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.