రైలు ప్రమాద బాధితులకు పరామర్శ
23 Jan, 2017 13:57 IST
విజయనగరంః రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరామర్శించారు. పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లకు సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.