తెలుగు తేజం పీవీ సింధుకు వైయస్‌ జగన్‌ అభినందనలు

16 Dec, 2018 13:15 IST
శ్రీకాకుళం: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్‌ టైటిల్‌ గెలుచుకున్న తెలుగు తేజం పీవీ సిం«ధుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 2018 సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన విజయంతో ముగింపు పలికారని ప్రశంసించారు. పీవీ సింధు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఫైనల్‌ పోరులో జపాన్‌ షెట్లర్‌ నొజోమి ఒకుహారాతో తలపడి వరుస సెట్ల ఆధిక్యంతో పీవీ సింధు విజయం సాధించింది.