శుభాకాంక్షలు ట్వీట్ చేసిన వైఎస్ జగన్

25 Dec, 2015 14:20 IST
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ ప్రజలకు ట్విట్టర్ లో క్రిస్మస్ శుభాకాంక్షలు  తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలు  అందరూ సుఖశాంతులతో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.