వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారభేరి..!
6 Nov, 2015 17:28 IST
వంరగల్ః
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు , వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్ పర్యటన ఖరారైంది. ఈనెల 21న
వరంగల్ లో జరగనున్న ఉపఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ ప్రచార తేదీలను పార్టీ నేతలు వెల్లడించారు . ఈనెల 16 నుంచి 19 వరకు వైఎస్ జగన్ వరంగల్ లో ప్రచారం
నిర్వహిస్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన
మీడియా సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమేరకు ప్రకటన చేశారు.
వరంగల్
పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి మేజర్
గ్రామపంచాయతీలో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తారు. పేద ప్రజలకు భరోసా
కల్పించేందుకు... వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపే
లక్ష్యంగా నాలుగు రోజుల పాటు వైఎస్ జగన్ జిల్లాలో ప్రచారం చేపడుతారు.
ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరువకావాలంటే అది రాజన్న రాజ్యంతోనే
సాధ్యమని వరంగల్ ప్రజలు విశ్వసిస్తున్నారు.