అశ్రునయనాల మధ్య నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తి

కర్నూలు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి . అశ్రునయనాల మధ్య నారాయణరెడ్డికి వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వీడ్కోలు పలికారు. అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నారాయణరెడ్డి స్వగ్రామం చెరుకులపాడుకు చేరుకున్నారు. నారాయణరెడ్డి పార్ధీవదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏ కష్టం ఎదురైనా మీకు నేను అండగా ఉంటానని వైయస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. నారాయణరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా తరలివచ్చారు. అడుగుతీసి అడుగేయలేని జనసంద్రం మధ్య నారాయణరెడ్డి అంతిమయాత్ర సాగింది. నారాయణరెడ్డి అనుచరులు, పార్టీ నాయకులు బోరున విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతల దాడిలో హత్యకు గురైన నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు అంత్యక్రియలు చెరువుకులపాడు గ్రామంలో పూర్తయ్యాయి.