వైయస్ జగన్ ప్రచారం@8వ రోజు
16 Aug, 2017 10:47 IST
నంద్యాల: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. బుధవారం నంద్యాల పట్టణంలోని పీవీ నగర్ నుంచి వైయస్ జగన్ రోడ్‌షో ప్రారంభమైంది. మాల్దార్‌పేట, స్వాలిహీన మసీదు మీదుగా.. ఆ తరువాత 3,5,6 వార్డుల పరిధిలోని ముత్తు ఇళ్లు, నబీనగర్, జగజ్జీవని టెంపుల్ మీదుగా ఆత్మకూరు బస్టాండ్ వరకు ప్రచారం కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.