నంద్యాలలో వైయస్ జగన్ 12వ రోజు ప్రచారం

20 Aug, 2017 10:41 IST

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారం 12వ రోజుకు చేరుకుంది.  సంఘమిత్ర నుంచి వైయస్ జగన్ సలీంనగర్ కు చేరుకున్నారు.  అడుగడుగునా నంద్యాల ప్రజలు జననేతకు నీరాజనం పడుతున్నారు. వైయస్ జగన్ రోడ్ షో కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  వైయస్సార్సీపీకే తమ ఓటు అని నినదిస్తున్నారు. మోసపూరిత హామీలతో వంచించిన బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.