మాజీ ఎంపీపీ కుటుంబానికి వైయస్ భాస్కర్‌రెడ్డి పరామర్శ
5 Apr, 2017 17:22 IST
వైయస్ఆర్ జిల్లా(సింహాద్రిపురం): ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన మాజీ ఎంపీపీ మేకల సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను బుధవారం వైయస్‌ఆర్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైయస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. అంకాలమ్మ గూడూరు గ్రామానికి వెళ్లి సుబ్బరాయుడు మృతదేహం వద్ద సంతాప తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. ఆయన వెంట వైయస్‌ఆర్‌సీపీ నాయకులు చల్లా మహేశ్వరరెడ్డి, సోమశేఖరరెడ్డి, అశోక్‌రెడ్డి, చప్పిడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.