ఘనంగా వైయస్ అవినాష్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
27 Aug, 2017 14:45 IST
వైయస్ఆర్ జిల్లాః కడప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వైయస్ఆర్ సీపీ రైతు నాయకుడు ప్రసాద్‌రెడ్డి అనాథాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా జమ్మలమడుగులో వైయస్‌ఆర్ సీపీ నేత హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.