చంద్రబాబు స్క్రిప్ట్.. ఫాలో అయిన మినిస్టర్

28 Nov, 2015 09:26 IST

హైదరాబాద్)ప్రభుత్వం తరపున బాక్సైట్ విధానంపై సీనియర్ మంత్రి యనమల రామక్రష్ణుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 బాక్సైట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల్నే ప్రకటనలో వినిపించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం జిల్లా చింతపల్లి ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు జరిగిన ప్రయత్నాలు, దుబాయి అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(దుబాల్)కుఆ నిల్వలను కట్టబెట్టేందుకుగాను.. ఆ దేశ ప్రతినిధులకు చంద్రబాబు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికిన వైనాన్ని కానీ మచ్చుకైనా ప్రస్తావించకుండా తప్పంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనంటూ ఆయనపై నెపం నెట్టేందుకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో యనమల శతవిధాలా ప్రయత్నించారు.

శ్వేతపత్రం అంటేనే వాస్తవాలని తన ప్రకటనలో పేర్కొన్న యన మల గతంలో తమ హయాంలో బాక్సైట్ తవ్వకాలకు  చేసిన యత్నాలకు సంబంధించిన వాస్తవాలను కనీసం ప్రస్తావించలేదు. బాక్సైట్ తవ్వకాలపై తాము వేసిన 24 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాతనే కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడాలని యనమల పేర్కొన్నారు.
  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చింతపల్లి ఏరియాలో పర్యటిస్తే బాగుంటుందని అందులో సూచించారు.