వైఎస్ జగన్ కు ముస్లిం మతపెద్దల ఆశీర్వాదం
               18 Nov, 2015 15:52 IST            
                    మూడవ రోజు ప్రచారంతో హోరెత్తిస్తున్న జననేత
కాజీపేట దర్గాలో జగన్ ప్రార్థనలు 
వరంగల్ః
 వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడవ రోజు వరంగల్ పార్లమెంట్ 
నియోజకవర్గంలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అడుగడుగునా జననేతకు ప్రజలు ఘన
 స్వాగతం పలుకుతున్నారు. విద్యార్థులు,యువకులు, వృద్ధులు, మహిళలు, రైతులు, 
కూలీలు ప్రతి ఒక్కరినీ వైఎస్ జగన్ ఆత్మీయంగా నమస్కరిస్తూ...వారి కష్టసుఖాలు
 అడిగి తెలుసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. 
కాజీపేటలో
 ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను దర్శించుకుని జగన్ ప్రార్థనలు చేశారు. 
పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 
ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలసి దర్గాకు వచ్చిన వైఎస్ జగన్ కు ...కుసుర్ 
పాషా, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్
 రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎంతో చేశారని వైఎస్ జగన్
 అన్నారు. నల్లా సూర్యప్రకాశ్ ను గెలిపించాలని మైనారిటీలను కోరారు. 
గతంలోనూ
 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈదర్గాను దర్శించుకున్నారని వైఎస్సార్సీపీ మైనారిటీ
 నేత రెహమాన్ గుర్తు చేసుకున్నారు. వరంగల్ ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ గెలుపు
 తథ్యమని రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, 
బీసీ, ఓసీ ఓటర్లంతా వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారని రెహమాన్ అన్నారు. మళ్లీ 
రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన సువర్ణ పాలన చూడాలంటే 
వైఎస్సార్సీపీ గెలుపుతోనే సాధ్యమన్నారు. ఆమహానేత మరణించినా తమ గుండెల్లో 
ఇంకా బతికే ఉన్నారని వరంగల్ ముస్లిం సోదరులు తెలిపారు. వైఎస్సార్సీపీని 
గెలిపిస్తామని తేల్చిచెప్పారు.