ముడుపులు అందితే గానీ పనులు జరగని దుస్థితి
22 Mar, 2016 11:50 IST
హైదరాబాద్ః మదనపల్లెలో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అంతేకాకుండా చేస్తున్న పనులు సైతం ఎంతో నాసిరకంగా ఉన్నాయని స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి అన్నారు. మున్సిపల్‌లోని శానిటేషన్ శాఖలోఅవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లు అధికారులకు, అధికారులు అధికారపార్టీ నేతలకు కమీషన్లు ఇస్తే కానీ పనులు జరగని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయని చెప్పారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే అడ్డగోలు సమాధానాలు చెబుతున్నారన్నారు.