ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
8 Mar, 2017 14:38 IST
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత గుర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందని గుర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.