తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
23 Jan, 2015 17:45 IST
- నిర్ణయం ప్రకటించిన అధిష్టానం
- అందరి ఆమోదం మేరకే నిర్ణయం
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అధికార పార్టీ తరపున వెంకటరమణ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. ఈ పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వైఎస్సార్సీపీ అధిష్టానం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో జగన్మోహన్రెడ్డి చర్చించారు. తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పేర్కొన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.