‘వెలంపల్లి’కి అభినందనల వెల్లువ

23 Feb, 2017 18:24 IST

విజయవాడ: వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షునిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు పార్టీ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, సెంట్రల్‌ నియోజకవర్గం నాయకులు దాసరి దుర్గారావు, ఉదయ్‌ శంకర్, శ్రీనివాసరావు, సాంబిరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెలంపల్లిని కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేసి, అభినందనలు తెలిపారు.