ప్రతి చిన్న కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం

8 May, 2018 14:52 IST

సెలూన్లకు డొమెస్టిక్ కరెంటు ఛార్జీలు

కార్పొరేషన్లతో తక్కువ వడ్డీతో రుణాలు అందే ఏర్పాటు

నాయీ బ్రాహ్మణులకు వైయస్ జగన్ భరోసా

 నాయీ బ్రాహ్మణులు లేకుంటే నాగరిక సమాజానికి మనుగడ లేదని, అటువంటి కీలకమైన వారికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు, వారికి అండదండలు అందిస్తూ , పురోభివృద్ధికి పాటు పడేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఆయనను మంగళవారం ఉదయం కృష్ణా జిల్లాలో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత  గుర్తింపు పొందిన అన్ని దేవాలయాల పాలక మండళ్లలోనూ నాయీబ్రాహ్మణులకు సభ్యత్వం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వబ్రాహ్మణులు, కుమ్మరులు, రజకులు మెదలైన కులాల వారు రాజకీయంగా వెనకబడి ఉన్నారన్నారంటూ , పార్టీలు కూడా  ఎమ్మెల్యే  టిక్కెట్లు కూడా  ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా వారి సమస్యలు చెప్పుకోడానికి తగిన వేదిక లేకుండా పోతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో  యి బ్రాహ్మణులకు , రజకులకు, కుమ్మరులకు విశ్వబ్రాహ్మణులకు చిన్న కులాల వారికి కూడా చట్టసభల్లో తాము ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ ప్రకటించారు.

నాయీ బ్రాహ్మణసంఘం ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై స్పందిస్తూ, ప్రస్తుతం సెలూన్లకు నెలకు దాదాపుగా 4 వేల రూపాయల మేర  కరెంటు బిల్లులు వస్తుంటే వారెలా బతకాలో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టి మిట్టాడుతున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా సెలూన్లలో వినియోగించే కరెంటులో 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామనీ, 500 యూనిట్ల వరకు వినియోగించే కరెంటును డొమెస్టిక్ కేటిగిరీ కిందనే పరిగణించేలా టారిఫ్ ను సవరిస్తామని హామీ ఇచ్చారు. అయితే 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునా, లేకపోతే సాలీనా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయమో ఏదో ఒకదానిని మాత్రం అమలు చేస్తామన్నారు. ప్రస్తుతమున్న ఫెడరేషన్ వల్ల ప్రత్యేకంగా లబ్ది చేకూరని పరిస్థితుల్లో, నాయీ బ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తక్కువ వడ్డీకే వారందరికీ రుణాలు అందేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రతి కులానికి కూడా ఇలాంటి మేలునే చేస్తామన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు సరైన వేతనాలు అందడం లేదని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా విధులు నిర్వహిస్తున్న అందరికీ గుర్తింపు కార్డులతోపాటు, నిర్ణీత వేతనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరి సమస్యలను ప్రస్తావించి, పరిష్కరించడానికి వీలుగా ప్రతి దేవాలయ పాలక మండలిలోనూ వీరికి ప్రాతినిద్యం కల్పిస్తామన్నారు.