బాధితులకు బాసటగా నిలుస్తాం
తాడేపల్లి (ఘంటసాల): అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందని కృష్ణాజిల్లా వైయస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి పరుచూరి సుబాష్‌చంద్రబోస్ అన్నారు. తాడేపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన తొమ్మిది కుటుంబాల వారిని కలసి వారితో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ. 2 వేల చొప్పున రూ.18 వేలు ఆర్థికసాయం అందించడమే కాక ప్రమాదం జరిగిన నాటి నుండి మంగళవారం వరకు షామియాన, కుర్చీలు, భోజన సదుపాయలకు అవసరమైన ఖర్చును మొత్తం బోస్ భరించారు. దివంగతనేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆపదలో ఉన్న వారికి వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తమవంతు సహకారం అందించడం జరుగుతుందని బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవచేయడమే వైయస్సార్‌సీపీ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోనే అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు మద్దిరాల వీరాస్వామీ పరామర్శించి వైద్యఖర్చుల నిమిత్తం రూ. 2వేల ఆర్థికసాయాన్ని సుబాష్‌చంద్రబోస్ అందించారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.