వైయస్ ఆర్ సీపీలో చేరిన వక్ఫ్ బోర్డు మాజీ డైరక్టర్

1 Jul, 2018 14:11 IST

కర్నూలు జిల్లా కల్లూరులో వక్ఫబోర్డు మాజీ డైరక్టర్ సుభాన్ తో సహా దాదాపు 150 మంది వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కల్లూరు ఊరికివాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో కాటసాని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం అరాచక పాలనకు చరమ గీతం పాడటానికి ప్రతి కార్యకర్త పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.