ప్రధానితో విజయసాయిరెడ్డి భేటీ
13 Apr, 2017 11:52 IST
న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధాని నరేంద్రమోడీతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం 11.45 గం.లకు ప్రధానమంత్రిని విజయసాయిరెడ్డి కలిసి ఏపీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై దాదాపు 15 నిమిషాలసేపు చర్చించారు. వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన అన్ని అంశాలపైనా ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు. ఆ అంశాలను త్వరలోనే పరిశీలించి వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.