విజయమ్మతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
10 Oct, 2012 02:32 IST
హైదరాబాద్, 10 అక్టోబర్ 2012: బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ రిచర్డ్ హైడ్ మంగళవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ నేతలు మైసూరారెడ్డి, శోభానాగిరెడ్డి, వైయస్ అనిల్‌రెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఈ సందర్భంగా ఉన్నారు. డిప్యూటీ హైకమిషనర్ వెంట హెడ్ ఆఫ్ మిషన్స్ అరుణ్ కూడా వచ్చారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ భవిష్యత్ రాజకీయాల్లో పార్టీ నిర్వహించబోయే పాత్రను, పార్టీకి గల ప్రజాదరణను దృష్టిలో ఉంచుకునే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈ భేటీకి ఆసక్తి కనబరచినట్లు సమాచారం.