విజయమ్మకు ఉప్పల్‌లో ఘన స్వాగతం
29 Oct, 2012 16:56 IST
హైదరాబాద్, 29 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ శివారులోని ఉప్పల్ వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, వైయస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయమ్మకు సాదరంగా స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో నిర్వహంచే సభలో యువ తెలంగాణ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఈ సభలో పాల్గొని, బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు విజయమ్మ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళుతున్నారు. ఇదే సభలో జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు పలువురు తెలంగాణ నాయకులు విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. విజయమ్మ వెంట పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.