వీర జవాన్లకు వైఎస్సార్ సీపీ నివాళి
12 Jan, 2013 10:41 IST
రాజమండ్రి:
పాకిస్థాన్ సైనికుల చేతిలో దారుణ హత్యకు గురైన మన దేశ అమర జవాన్లకు జాతి యావత్తూ నివాళులుర్పించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాక్ సైన్యం చేతిలో హతులైన భారత సరిహద్దు సైనికులు లాన్సు నాయక్ సుధాకర్ సింగ్, హేమరాజ్‌లకు పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మాజీ మేయర్ ఎం.ఎస్. చక్రవర్తి మాట్లాడుతూ పాకిస్తాన్ ఓ పక్క స్నేహ హస్తం అందిస్తూనే మరోపక్క విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్నారు. జవాన్ల ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.