నష్టాల్లో ఉన్నాయని అన్నీ మూసేస్తారా..?

24 May, 2017 13:34 IST

హైదరాబాద్ః 9వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. విద్యార్థులు, సిబ్బంది లేరని స్కూళ్లను మూసేయడమేంటని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తగ్గిపోయిన నేపథ్యంలో దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి...నష్టాల్లో ఉన్నాయని చెప్పి మూసేయడమేంటని నిలదీశారు. నష్టాల్లో ఉందని చెప్పి రేపు ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేస్తారా అని మండిపడ్డారు.