వైయస్ విగ్రహం చుట్టూ టిడిపి ఫ్లెక్సీలు
10 Oct, 2012 01:16 IST
అనంతపురం, 10 అక్టోబర్ 2012: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు ఫ్లెక్సీలు కట్టారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి అనిల్ కుమార్ పై రు దాడికి కూడా యత్నించారు. అనంతపురం జిల్లా బెలుగుప్పలో టిడిపి శ్రేణులు ఓవరాక్షన్ చేశారు. దాంతో అనిల్ కుమార్ బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అయితే బెలుగుప్ప ఎస్సై రఫీ మాత్రం తెలుగుదేశం నాయకులకు వంతపాడడం గమనార్హం. ఫోటో ఎందుకు తీశావంటూ అనిల్‌అనిల్ కుమార్ పై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు.