'వైఎస్ మీద కక్షతోనే విద్యార్థులకు వేధింపులు'
7 Sep, 2012 02:17 IST
ప్రభుత్వానికి చేవలేదని, చేతగానిదని విజయమ్మ విమర్శించారు. నిరుపేదలకు ఏం చేయాలో, ఎలా చేయాలో వైయస్ నిరూపించారని విజయమ్మ అన్నారు. చదువులపై చేసే ఖర్చును వైయస్ సామాజిక పెట్టుబడిగా భావించారన్నారు. అదే వైయస్ విజన్ అని ఆమె అన్నారు. చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఒక్క విద్యార్థి అయినా చెబుతారా అని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. బీసీల పట్ల బాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో గత ఎన్నికల్లోనే చూశామని విజయమ్మ వ్యాఖ్యానించారు.