
అనంతపురం, 9 అక్టోబర్ 2012: ‘దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులపై ఎంతో అభిమానంతో వారి ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైయస్ మరణించిన తర్వాత అధికారం చెలాయిస్తున్న ప్రస్తుత పాలకులు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. పూర్తి స్థాయిలో పథకాన్ని అమలుచేస్తే ఆ క్రెడిట్ వైయస్‌కే ఎక్కడ దక్కుతుందో అని రోజుకో నిబంధన పెడుతున్నారు. తద్వారా పేద విద్యార్థులకు ఈ పథకాన్ని దూరం చేస్తున్నారు’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో సోమవారం నిర్వహించిన బీసీ గర్జన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మున్సిపల్ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు.